Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jan-2017 11:33:06
facebook Twitter Googleplus
Photo

సీనియర్ల నుంచి యువ కథానాయకుల వరకు టాలీవుడ్లో అందరికీ కథానాయికల కొరత ఉంది. హీరోయిన్లుగా కొంచెం ఇమేజ్ ఉన్న వాళ్లనే స్టార్ హీరోలు ప్రిఫర్ చేస్తుండటంతో వాళ్లకు కథానాయికల్ని సెట్ చేయడం కష్టమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాకు ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూడు క్యారెక్టర్లకూ జోడీలు వెతకాల్సి ఉందట. ఆ ముగ్గురు హీరోయిన్లు వీళ్లే అంటూ మీడియాలో నెల కిందటే వార్తలొచ్చాయి. ఐతే నిర్మాత కళ్యాణ్ రామ్ ఆ వార్తల్ని ఖండించాడు. ఏదీ ఫైనలైజ్ కాలేదన్నాడు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూడమన్నాడు.

ఇంకో రెండు వారాల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ఐతే ఇప్పటికీ హీరోయిన్లు ఖరారు కాలేదని సమాచారం. ఐతే ఇందుకోసం ఒక షార్ట్ లిస్ట్ అయితే రెడీ అయిందట. కీర్తి సురేష్.. అనుపమ పరమేశ్వరన్.. రాశి ఖన్నా.. నివేదా థామస్.. కాజల్ అగర్వాల్.. ఈ ఐదుగురినీ కన్సిడరేషన్లో ఉంచినట్లు సమాచారం. అన్ని రకాలుగా పరిశీలించి.. ఇందులో ముగ్గురిని ఎంచుకుంటారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్.. శ్రుతి హాసన్ లను కూడా అనుకున్నారట కానీ.. డేట్ల సమస్య వల్ల వారు అందుబాటులో లేకుండా పోయారు. మరి ముగ్గురు ఎన్టీఆర్ లతో జోడీ కట్టబోయే ఆ ముగ్గురు భామలు ఎవరో మరి?

,  ,  ,  ,  ,  ,