Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2016 11:21:57
facebook Twitter Googleplus
Photo

చాలా రోజుల తరువాత అక్కినేని హీరోలందరూ మాంచి ఊపు మీద కనిపిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది సోగ్గాడే చిన్నినాయనా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం.. ఇప్పుడు ప్రేమమ్ సినిమా కూడా దానినే ఫాలో అవ్వడం అందరికీ ఆనందం కలిగించే విషయమే. ఇప్పుడు అదే రూటులో వెళ్ళి జెండా పాతేయడానికి మన సుమంత్ కూడా వచ్చేస్తున్నాడు. అదిగో అక్కడే ఒక చిన్న ట్విస్టు.

ఈ నవంబర్ 4న సుమంత్ ''నరుడా డోనరుడా'' అంటూ విచ్చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ తో ఇప్పటికే టాలీవుడ్ ను బాగా ఇంప్రెస్ చేసేశాడు మనోడు. సినిమాలో ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ ప్రయోగాత్మక సబ్జెక్ట్.. అలాగే అందులోని కామెడీ.. రొమాన్స్.. అన్నీ బాగున్నాయని ట్రైలర్ చూసినవారందరూ ఫిక్సయిపోయారు. అందుకే ఈ సినిమా సూపర్ హిట్టయ్యేలా ఉంది. పైగా హిందీలో ఆల్రెడీ విక్కీ డోనార్ పెద్ద హిట్టు కాబట్టి.. తెలుగులో కూడా అదే ఫేట్ రిపీటవ్వాలని స్వయంగా అన్నపూర్ణ సంస్థే సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. ఇలాంటి ప్లానింగ్ జరుగుతున్నప్పుడు.. నవంబర్ 11న నాగచైతన్య నటించిన ''సాహసం శ్వాసగా సాగిపో'' సినిమాను రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. ఇదే అసలు ట్విస్ట్ మరి.

ఆల్రెడీ చాలా ధియేటర్లలో ప్రేమమ్ సినిమా నడుస్తోంది. కాకపోతే ఇతర సినిమాలు ఖాళీ అయిపోయాయ్ కాబట్టి.. అక్కడ నరుడా డోనరుడా సినిమాను దించుతున్నారు. ఇప్పుడు మళ్లీ వెంటనే సాహసం శ్వాసగా అంటే.. ధియేటర్ల ఎడ్జస్టమెంట్ కుదురుతుందా అనేది ఫ్యాన్స్ ప్రశ్న. మరి సుమంత్ అండ్ చైతన్య సినిమాల రిలీజ్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

,  ,  ,  ,  ,