Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Jul-2015 15:04:02
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం త్రివిక్రమ్ కొరటాల వార్ ఫిలింనగర్లో హాట్ టాపిక్. ఓ హీరో కోసం ఇద్దరూ కొట్టుకుంటున్నారన్నది వేడి వేడి వార్త. అంత పెద్ద స్టార్ డైరెక్టర్లేంటి? హీరో కోసం కొట్టుకోవడమేంటి? కామెడీగా ఉందనిపిస్తోందా? అనిపించినా ఇది మాత్రం ఫక్తు నిజం. పక్కా జెన్యూన్. అవును టెంపర్ తో హిట్ కొట్టి తారక్ లైమ్ లైట్లో కొచ్చాడు. ఇదే ఊపులో అతడు సుకుమార్ దర్శకత్వంలో నటించేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అతడిని ఎలా అయినా ఒడిసిపట్టుకోవాలని ఇద్దరు స్టార్ డైరెక్టర్లు వెంటపడుతున్నారు. డీటెయిల్స్ లోకి వెళితే..

2013లో కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు కొరటాల. కానీ అప్పుడు ఎందుకో కుదరలేదు. ఇప్పుడు మరోసారి సంప్రదిస్తే సుక్కూ తర్వాత నీకే ఛాన్స్ ఉంటుందని తారక్ హామీ ఇచ్చాడని అంటున్నారు. అయితే ఇటీవలే మాటల మాయావి త్రివిక్రమ్ ఓ లైన్ చెప్పి ఎన్టీఆర్ ని బుట్టలో వేశాడని అంటున్నారు. తారక్ త్రివిక్రమ్ వైపు పాజిటివ్గానే స్పందించాడు. అయితే 'సన్నాఫ్ సత్యమూర్తి' లాంటి క్లాసిక్ తీసిన త్రివిక్రమ్ తనని మాస్ రాజాలాగా చూపిస్తాడా? అన్న సందేహం తో ఎన్టీఆర్ మిర్చి డైరెక్టర్ వైపే మొగ్గు చూపుతున్నాడని చెబుతున్నారు. ఆ రకంగా చూస్తే తారక్ త్రివిక్రమ్ కి హ్యాండిచ్చినట్టే కదా! ఏ విషయమూ ఎన్టీఆర్ నోట వింటే కానీ అది నిజం కాదని ప్రస్తుతానికి ఫిక్సవుదాం.

,  ,  ,