Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 11:13:35
facebook Twitter Googleplus
Photo

బిగ్ బాస్ షో మొదలవుతున్నపుడు ఆ షో ఏమాత్రం విజయవంతమవుతుందో అని ఎన్నెన్నో సందేహాలు. కానీ ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ ఈ షో హిట్టయింది. ఇందుకు హోస్టుగా ఎన్టీఆర్ చూపించిన నైపుణ్యం ఓ ప్రధాన కారణమైతే.. మిగతా క్రెడిట్ పార్టిసిపెంట్లకు ఇవ్వాలి. ఆ పార్టిసిపెంట్లలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకర్షించిన వాళ్లలో ముందుగా హరితేజ పేరు చెప్పాడు. సీరియళ్లతో.. సినిమాల్లో చిన్నా చితకా పాత్రలతో ఓ మోస్తరుగా పేరు సంపాదించిన హరితేజ.. బిగ్ బాస్ షోలో భలే హైలైట్ అయింది. ఈ షోకు వీక్ డేస్ లోనూ ఆదరణ దక్కడంలో హరితేజది కీలక పాత్ర. హౌస్ లో జనాలు అత్యంత మెచ్చిన పార్టిసిపెంట్ హరితేజే అంటే అతిశయోక్తి లేదు.

హరితేజ టాలెంట్.. ఆమె వాక్చాతుర్యం.. వ్యక్తిత్వం.. అన్నీ హోస్ట్ ఎన్టీఆర్ ను కూడా ఆకట్టుకున్నాయట. ఆమెకు ‘బిగ్ బాస్’ షో అయ్యాక బ్రేక్ ఇస్తానంటూ అతను హామీ ఇచ్చినట్లు సమాచారం. హరితేజ అఆ మినహాయిస్తే చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. ఎన్టీఆర్ హామీ ఇచ్చాడంటే.. తన సినిమాలతో పాటు వేరే వాటికి కూడా రెఫర్ చేసే అవకాశముంది. కాబట్టి హరితేజ ఫిలిం కెరీర్ ఊపందుకునే అవకాశముంది. ఆమె బిగ్ బాస్ విజేతగా నిలిస్తే.. ఎన్టీఆర్ రికమండేషన్ అవసరం లేకుండానే మంచి అవకాశాలు అందుకునే అవకాశముంది. ఈ షో ద్వారా మంచి పారితోషకం కూడా అందుతుంది కాబట్టి హరితేజ లైఫ్ సెటిలైపోయినట్లే.

,  ,  ,  ,  ,