Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2016 12:02:44
facebook Twitter Googleplus
Photo

రొటీన్ సినిమాల వరదలో కొట్టుకుపోయే టాలీవుడ్లో అసలు థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కడమే అరుదు. ఇక స్టార్ హీరోల నుంచి అలాంటివి కోరుకోవడం అంటే అత్యాశే. ఐతే ఈ మధ్య మన సినిమాల్లో చాలా మార్పు కనిపిస్తోంది. స్టార్లందరూ వైవిధ్యమైన సినిమాల వైపు అడుగులేస్తున్నారు. తాము ఇంతకుముందు టచ్ చేయని జానర్లలో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఒకప్పుడు ఒక మూసలో సినిమాలు చేసుకుంటూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. టెంపర్ నాన్నకు ప్రేమతో లాంటి వెరైటీ సినిమాలతో తన ఇమేజ్ చాలా వరకు మార్చుకున్నాడు. ఈ రెండు సినిమాల్లోనూ కొంచెం థ్రిల్లర్ టచ్ ఉంటుంది. ఐతే త్వరలోనే అతను పూర్తి స్థాయి థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడు.

మెగా ఫోన్ పట్టాలని దీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న స్టార్ రైటర్ వక్కంతం వంశీ.. ఎన్టీఆర్ కోసం తయారు చేస్తున్నది థ్రిల్లర్ కథాంశమే అని సమాచారం. ఐతే టెంపర్ నాన్నకు ప్రేమతో తరహాలోనే ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందట. ఎన్టీఆర్ తన సినిమా కోసం రెడీ అవ్వడానికి ఇంకా మూడు నెలలైనా పట్టే అవకాశముండటంతో వంశీ.. ఓపిగ్గా స్క్రిప్టుకు మెరుగులు దిద్దుకుంటున్నాడట. మధ్యలో ఎన్టీఆర్ కొన్ని అభ్యంతరాలు చెప్పడంతో స్క్రిప్టులో మార్పులు కూడా చేస్తున్నట్లు సమాచారం. ?టెంపర్? వంశీ తాను దర్శకుడు కావడానికి రాసుకున్న కథ. ఐతే అప్పుడు కుదరక పూరికి ఇచ్చాడు. ఈసారి దాన్ని మించిన కథతో మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నాడట అతను. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామే నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,  ,