Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2016 11:03:34
facebook Twitter Googleplus
Photo

నిజానికి దర్శకుడు పూరి జగన్ అంటే చాలామంది స్టార్ హీరోలకు బాగా ఇష్టం. ఎందుకంటే మనోడు ఒక్కసారిగా హీరోలకు ఎక్కడాలేని కొత్త యాటిట్యూడ్ ను చేరుస్తాడు. వారిలో ఎనర్జీ నింపేస్తాడు. ఇడియట్ లో రవితేజ.. పోకిరిలో మహేష్.. బుజ్జిగాడులో ప్రభాస్.. హార్ట్ ఎటాక్ లో నితిన్.. ఇలా పూరి హీరోలందరూ రెచ్చిపోతారు అంతే. తరువాత టెంపర్ లో ఎన్టీఆర్ ను సైతం న్యూ డైమన్షన్ లో ఆవిష్కరించాడు. ఇదంతా చెప్పిన తరువాత కూడా అసలు ఎన్టీఆర్ కు పూరి జగన్ అంటే ఎందుకిష్టమో వేరే చెప్పాలంటారా? అలా అయితే ఎన్టీఆర్ ఆన్సర్ వినుకోండి.

''నా కెరియర్ అనేది.. టెంపర్ సినిమాకు ముందు.. టెంపర్ తరువాత అంటూ మార్చేశాడు పూరి జగన్ భయ్యా. ఆ సినిమా చేసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చేసింది. ప్రతీ విషయాన్ని డిఫరెంట్ గా చూడటం నేర్చుకున్నాను. అందుకే నాకు పూరి భయ్యా అంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు కళ్యాణ్ రామ్ అన్న జగన్ గారితో పనిచేస్తే.. ఆయన ఒక కొత్త కోణంలో కనిపిస్తారని నాకు ఆశ ఉండేది. ఇప్పటికి ఆ ఆశ తీరింది. అన్న లుక్ అదిరిపోయింది. లుక్ అంటే కండలూ అవీ కాదు. యాటిట్యుడ్'' అంటున్నాడు యంగ్ టైగర్. పూరి డైరక్షన్లో ఎవరు చేసినా కూడా మారిపోతారట. అదిగో కళ్యాణ్ రామ్ కూడా ఇంతవరకు ఎన్నడూ చూడని విధంగా కొత్తగా కనిపిస్తున్నాడట. అట ఏముంది.. నిజంగానే కొత్తగా ఉన్నాడు. అదరగొట్టేశాడు.

ఇకపోతే ''ఇజం'' సినిమా ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్ మాటతీరు చూస్తుంటే.. ఖచ్చితంగా మనోడు తదుపరి సినిమాను పూరి జగన్ తోనే చేసేలా ఉన్నాడు. ఇప్పటికే ''బాక్సర్'' అంటూ ఒక కథ.. ''బ్రదర్స్'' అంటూ మరో కథ పూరి రెడీ చేశాడని కూడా టాక్. చూద్దాం మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడో!!

,  ,  ,  ,  ,