Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2015 11:27:18
facebook Twitter Googleplus
Photo

హాస్యరసం పరిపూర్ణంగా సంతరించుకున్న రూపమే బ్రహ్మానందం. ప్రేక్షకులను నవ్వించడానికి ఆయన పెద్దగా ప్రయోగాలు చేయడు. ఒక చిన్న ఎక్స్ ప్రెషన్ .. ఒక చిన్న మూమెంట్ చాలు .. అంతే జనం కడుపుబ్బ నవ్వుకుంటారు. ఆయన పాత్ర కోసమని మళ్లీ మళ్లీ ఆ సినిమాను చూస్తారు. అలాంటి బ్రహ్మానందం .. 'జ్యోతిలక్ష్మి' సినిమాలో ఒక విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన కోసం ప్రత్యేకంగా పూరీ ఈ పాత్రను క్రియేట్ చేశాడని అంటున్నారు. గతంలో 'పోకిరి' సినిమాలోని బ్రహ్మానందం పాత్రకి దక్కిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ స్థాయిలో ఆడియన్స్ ని అలరించేదిగా ఈ పాత్ర ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ షూటింగులో ఈ రోజు నుంచి బ్రహ్మానందం జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన కాంబినేషన్లోని ఆసక్తికరమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తెలుగు తెర ముద్దమందారంగా చెప్పుకునే ఛార్మీ, ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇది పూరీ సినిమా కావడంతో .. ఆయనకి గల ఇమేజ్ కారణంగా అంచనాలు వున్నాయి. బ్రహ్మానందం ఎంట్రీ కారణంగా ఆడియన్స్ ఆసక్తి మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.

,  ,  ,  ,  ,  ,