Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Sep-2016 10:47:49
facebook Twitter Googleplus
Photo

ఈసారి మాటలు రాలేనంత అనుభూతిని డైరక్టర్ కొరటాల శివ గారు అందించడం జరిగింది. దీనికంటే గొప్ప గిఫ్ట్ ఏంటంటే.. సెప్టెంబర్ 1 ఈ సినిమా రిలీజైంది.. 2న మా అమ్మానాన్నల పుట్టినరోజు. 60 నిండినయ్ ఇద్దరికి. ఈ చిత్రంతో 12-13 ఏళ్ళ నా తపన వారికి తెలియ చేద్దామనే సంకల్పాన్ని ఈ జనతా గ్యారేజ్ రూపంలో అందించిన శివకు ఆ జన్మాంతం ఋణపడే ఉంటాను'' అంటున్నాడు ఎన్టీఆర్. గత సాయంత్రం పార్క్ హయాత్ హోటల్ లో జరిగిన జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్లో ఈ విధంగా చెప్పాడు.

ఇది ప్రేక్షకులు.. అభిమానులూ.. జనతా అందించిన సక్సెస్ అంటూ చెప్పిన తారక్.. ''ఈ విజయాన్ని హృదయానికి దగ్గరగా తీసుకుని.. చాలా బాధ్యతతో సినిమాలు తీస్తాను'' అన్నాడు. ఇదే సమయంలో సమంతతో చేయొద్దు.. సెంటిమెంటల్ గా తనతో చేస్తే ఫ్లాపు అవుతుందని అందరూ అన్నా కూడా.. ఎందుకో సమంత ఈ రోల్ చేస్తే బాగుంటుంది అనుకున్నాడని. ''నేను సమంత ఉంటేనే బాగుంటుంది అనుకున్నా. మా డైరక్టర్ కూడా అది అర్ధంచేసుకుని ఆమెను పెట్టారు. ఈ సక్సెస్ తో ఆ సెంటిమెంట్లన్నీ పోయాయ్ . అసలు నేను అలాంటి సెంటిమెంట్లు నమ్మను నేను'' అన్నాడు తారక్.

''వికాస్ అనే క్యారక్టర్ రాజీవ్ కనకాల చేశాడు కాబట్టే అంత పెద్ద హిట్టయ్యింది. ఆ ఎపిసోడ్ మొత్తం బాగా నచ్చేసింది. మేమిద్దరం కలసి ఒక పెద్ద హిట్టు కొట్టాలని ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు అదే జరిగింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ లేకపోతే జనతా గ్యారేజ్ విజయం చాలా కష్టమైంది. అద్భుతమైన విజువల్స్ కి అద్భుతమైన మ్యూజిక్ లేకపోతే కష్టం. దేవి సక్సెస్ రేటు గురించి చెప్పక్కర్లేదు.. కాని జనతా గ్యారేజ్ కోసం ఆయన అందించిన మ్యూజిక్ అద్భుతం'' అని చెబుతూ.. పంపిణీదారులను.. అందరూ సినిమాను నమ్మినందుకు ప్రోత్సాహించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ఎన్టీఆర్

,  ,  ,  ,  ,  ,