Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2016 13:36:26
facebook Twitter Googleplus
Photo

అదండీ అమ్మాయి వరుస. మెగా డాటర్ కొణిదెల నిహారిక ఇప్పుడు ''ఒక మనసు'' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటివరకు కేవలం ఇంటర్నెట్ ప్రిన్సెస్ గా ఉన్న ఈ మెగా బ్యూటి.. ఇప్పుడు తొలిసారి హీరోయిన్ గా వస్తోంది మరి. ఇంతకీ ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది.

సంధ్య అనే డాక్టర్ పాత్రలో కనిపిస్తోంది నిహారిక. సూర్య అనే ఒక యువకుడిగా నాగ శౌర్య కనిపిస్తున్నాడు. ఇతగాడు ఒక పొలిటీషియన్ కొడుకు. మీ నాన్న ఇష్టమా నేను ఇష్టమా అంటే.. మా నాన్నే ఇష్టం అంటున్నాడు. మరి మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ అని హీరోయిన్ అడిగితే.. ఇద్దరూ సమానం అని చెబుతాడు. ఇప్పుడు ఆ యువతీయువకుడి ప్రేమ ఎటు సాగుతుంది? బ్యూటిఫుల్ రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీలా దర్శకుడు రామరాజు ఈ సినిమాను అద్బుతంగా తీర్చిదిద్దాడని ఇట్టే చెప్పేయొచ్చు. విజువల్స్ అదిరిపోయాయ్. అలాగే సునీల్ కశ్యప్ అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది.

ఇక నిహారిక యాక్టింగ్.. బబ్లీనెస్.. ప్రెజన్స్.. ఆమె హీరోను ముద్దులు పెట్టుకుంటున్న తీరు.. ఆమె బోల్డునెస్.. అలాగే సింపుల్ లుక్ అదిరిపోయింది. ఖచ్చితంగా సినిమా రిజల్టు ఎలా ఉన్నా కూడా.. నిహారిక తెలుగు ఫిలిం ఇండస్ర్టీలో నిలబడిపోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

,  ,  ,  ,