Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Apr-2016 11:43:16
facebook Twitter Googleplus
Photo

వంద కోట్ల కలెక్షన్స్ అంటే చిన్న మాట కాదు. ఆ ఫీట్ సాధించేందుకు యాక్టర్స్ బోలెడు తపన పడుతుంటారు. అలాంటిది ఓ ఇద్దరు తమిళ హీరోయిన్స్ మాత్రం.. రెండు సార్లు ఈ ఫీట్ అందుకున్నారు. అయితే.. ఇద్దరికీ రెండో సినిమా ఒకటే కావడం విశేషం.

ఇంతకీ వాళ్లెవరో కాదు.. ఒకరు సమంత అయితే.. రెండో భామ అమీ జాక్సన్. విజయ్ తో నటించిన కత్తి ఇప్పుడు తెరి.. శామ్స్ ను వంద కోట్ల ఖాతాలో వేశాయి. అమీ జాక్సన్ అకౌంట్ లో అయితే.. శంకర్ తీసిన ఐ - రీసెంట్ విజయ్ మూవీ తెరిలు ఉన్నాయి. ఇలాంటి రికార్డుల విషయంలోను స్టార్ డమ్ విషయంలోనూ సమంత ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 'టాప్ ప్లేస్ లో ఉన్నపుడు.. నీ స్థానాన్ని భర్తీ చేసే వారి కోసం ఎదురుచూస్తున్నట్లే' అని చెప్పింది సమంత. ఈ సంగతి టాప్ స్టేటస్ కి మాత్రమే కాదు.. రికార్డుల విషయంలోనూ వర్తిస్తుంది. ఒక సినిమా సృష్టించిన రికార్డులను.. తర్వాత రాబోయే సినిమా కొట్టేయాలని ఆశించడం కూడా ఇలాంటిదే.

రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ చేసిన కామెంట్స్ కూడా ఇవే. అయితే.. ఆయన ఆశించినట్లుగా బాహుబలిని సర్దార్ దాటలేకపోయింది కానీ... బాహుబలిని మించిన సినిమా మరొకటి అయితే.. తప్పకుండా వస్తుంది కదా. అది బాహుబలి2 కావచ్చు. మరొకటి కావచ్చు.

,  ,  ,  ,  ,  ,  ,