Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2017 10:56:14
facebook Twitter Googleplus
Photo

బెస్ట్ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోన్న హీరోల్లో అల్లు శిరీష్ కూడా ఉన్నాడు. మొన్నటి వరకు ఒక ఫార్మట్ సినిమాలతో వచ్చిన ఈ హీరో ఇప్పుడు ఒక్క క్షణం అనే సై-ఫై థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి హిట్ సినిమా తర్వాత దర్శకుడు విఐ.ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఒక్క క్షణం త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకోనుంది. అయితే ముందుగా ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చెయ్యాలని నిర్మాత ప్లాన్ చేశాడు. దీంతో అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలనీ చిత్ర యూనిట్ కూడా వర్క్ లో వేగాన్ని పెంచింది. కానీ అఖిల్ హలో డిసెంబర్ 22న అలాగే నాని - MCA డిసెంబర్ 21న రిలీజ్ కాబోతుండడంతో రిస్క్ చేయడం బాగోదని సినిమా రిలీజ్ డేట్ ను మార్చారట.

రీసెంట్ గా చిత్ర యూనిట్ అంతా కలిసి చర్చించుకున్న తర్వాత డిసెంబర్ 28న రిలీజ్ చేయడం బెస్ట్ అని అప్పుడు రిలీజ్ చేస్తే థియేటర్స్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉందని అందరు ఒక నిర్ణయానికి వచ్చారట. నిజానికి గీతా ఆర్ట్స్ వారుండగా ధియేటర్లకు కొదవేం లేదులేగాని.. కాకపోతే దిల్ రాజు నుండి రిక్వెస్ట్ రావడంతో అల్లూ వారు వెనక్కెళ్ళారటలే.

,  ,  ,  ,  ,  ,