Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Feb-2017 10:40:30
facebook Twitter Googleplus
Photo

అక్క్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన భక్తి రస చిత్రం ఓం నమో వేంకటేశాయ. వీరిద్దరి కాంబినేషన్లో అన్నమయ్య, రామదాసు, షిరిడి సాయి వంటి హిట్ చిత్రాలు ప్రాణం పోసుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, భక్తులు ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా వారందరి అంచనాలు తగ్గట్టే ఉంది.
రాఘవేంద్ర రావు ముందుగానే సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్ ఒక తిరుమల అవుతుందని చెప్పినట్టు విడుదలైన ప్రతి చోట మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. అసమాన్యమైన నాగార్జున, సౌరభ్ రాజ్ జైన్ ల నటన, దర్శకేంద్రుడి మేకింగ్ స్టైల్, భక్తి భావం ఉట్టిపడే కథ కథనాలు, సన్నివేశాలు అన్నీ ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్నాయి. ఈ చిత్రంతో నాగార్జున ? రాఘవేంద్ర రావు ల హిట్ మ్యాజిక్ మరోసారి రిపీటైనట్టే అని విమర్శకులు, ప్రేక్షుకులు అంటున్నారు.

,  ,  ,  ,  ,