Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2016 12:15:42
facebook Twitter Googleplus
Photo

ఎనర్జిటిక్ హీరో రామ్.. టాలీవుడ్ యంగ్ బ్యూటీ రాశి ఖన్నా జంటగా నటించిన మూవీ హైపర్. రాబోయే దసరాకు ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుండగా.. ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టేసింది యూనిట్. ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు ఇంకా టైమ్ ఉండడంతో.. సాంగ్ ప్రోమోలను రిలీజ్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నారు.

'ఒంపుల ధనియా' అంటూ హీరో హీరోయిన్ల మద్య సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఎప్పటిలాగే.. రాశి అందాలు ఆరబోస్తే.. రామ్ రెచ్చిపోయి డ్యాన్స్ చేసేశాడు. గిబ్రాన్ అందించిన ట్రాక్ కు తగ్గట్లుగా స్టెప్స్ కుదరడంతో.. సాంగ్ బాగా వచ్చింది. విజువలైజేషన్ విషయంలో కూడా.. సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి.. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ప్రతిభ కనపడుతుంది.

పాట విషయంలో వంక పెట్టడానికి ఏం లేదు కానీ.. ప్రోమోలో కనిపించే ఓ స్టెప్(సీక్వెన్స్) మైండ్ బ్లాంక్ చేయడం ఖాయం. అటు వైపు తిరిగి హీరోయిన్ కొంచెం ముందుకు వంగి నడుం ఊపుతుంటే.. వెనక నుంచి వయొలెన్ వాయిస్తున్న స్టెప్ చూస్తే.. ఔరా మన తెలుగు సినిమా పాటలు.. స్టెప్పులు ఎంతటి ఘనమైన అభివృద్ధి సాధించాయా అని గర్వంగా చెప్పేసుకోవచ్చు.

,  ,  ,  ,  ,  ,