Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2015 11:07:59
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు కోసం అనుకున్న టైటిల్ ఇప్పుడు విచిత్రంగా యంగ్ హీరో రామ్ కు వెళుతోంది. క్రిష్ దర్శకత్వంలో మహేష్ హీరోగా 'శివం' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించడానికి గతంలో సన్నాహాలు జరిగిన సంగతి విదితమే. అయితే, కారణాంతరాల వల్ల ఆ ప్రాజక్టు మొదట్లోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడీ 'శివం' టైటిల్ రామ్ నటించే చిత్రానికి పెడుతున్నారు. కొత్త దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రామ్ అంగీకరించాడు. ఆ సినిమా కోసం ఈ 'శివం' టైటిల్ ఫైనల్ చేస్తున్నారని సమాచారం. రామ్ ప్రస్తుతం 'పండగ చేస్కో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే!

,  ,  ,  ,  ,  ,