Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-May-2015 11:02:56
facebook Twitter Googleplus
Photo

పండగచేస్కో .. అనేమాట యూత్ లో ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది. అంతగా పాప్యులర్ అయిన ఈ మాటనే టైటిల్ గా పెట్టడం వలన ఇది జనంలోకి బాగా వెళ్లింది. టైటిల్ చూస్తూ వుంటే .. రకుల్ తో రామ్ చేస్తోన్న సందడిని పోస్టర్స్ గా చూస్తుంటేనే ఈ సినిమాలో యూత్ కి కావలసిన ఐటమ్స్ బాగా వున్నాయని తెలిసిపోతోంది. పరుచూరి కిరీటి నిర్మాణంలో .. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సెన్సార్ వారి నుంచి యు/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా 2 గంటల 42 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకి రానుంది. రకుల్ ప్రీత్ సింగ్ .. సోనాల్ చౌహాన్ కథానాయికలుగా అలరించే ఈ సినిమాపై అంచనాలు బాగా వున్నాయి. అందువలన తెలంగాణ .. ఆంధ్ర రాష్ట్రాలలోను, ఓవర్సీస్ లోను భారీ రిలీజ్ కి ప్లాన్ చేశారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ కి పండగ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

,  ,  ,  ,  ,