Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Sep-2017 13:35:22
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులకు ఆనందం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కాటమరాయుడి తో పరవలేదనిపించిన పవన్ ఈ సారి తన 25వ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ఇప్పటికే షూటింగ్ ని శరవేగంగా జరుపుకుంటోంది.

అయితే ఇప్పటివరకు సినిమా ఫస్ట్ లుక్ ని గాని టైటిల్ ని గాని రిలీజ్ చెయ్యలేదు. అందుకు బలమైన కారణం ఉందట. సినిమాకి తగ్గట్టు క్యాచిగా ఉండే టైటిల్ సెలెక్ట్ చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. సో పూర్తిగా దానిపై ఓ నిర్ణయానికి వచ్చాక అనౌన్స్ చేస్తాడట. అసలైతే దసరా కే టైటిల్ ఫస్ట్ లుక్ రావాలి. కానీ సినిమా అనుకున్న టైమ్ కి షూటింగ్ పూర్తి చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ లుక్ లాంచ్ డేట్ ని మరొక డేట్ కి చేంజ్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబో కాబట్టి సినిమా బిజినెస్ వ్యవహారాలు కూడా అన్ని అయిపోయాయట.

ముఖ్యంగా ఓవర్సీస్ లో 20 కోట్లకు అమ్ముడుపోయిందని టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేయనుందని సమాచారం. ఇక ఈ సినిమాను జనవరి 10న సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నహకలు చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,