సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ అనేవి చాలా కామన్..కాకపోతే అవి మరి ఎక్కువైతే సదరు హీరో , హీరోయిన్స్ చెక్ పెట్టక తప్పదు..తాజాగా ఓ యంగ్ హీరో అలాంటి పనే చేసి తనపై వస్తున్న రూమర్స్ పై చెక్ పెట్టాడు..వివరాల్లోకి వెళ్తే..
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న రాజ్ తరుణ్ పై రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి..రాజ్ తరుణ్ దర్శకత్వం సంబందించిన విషయాల్లోవేలు పెడుతున్నాడని, షూటింగ్ కు టైం కు రావడం లేదని, ముఖ్యన్గా హీరోయిన్స్ విషయం లో కూడా తన సొంత తెలివి ఉపయోగిస్తున్నాడని ఇలా రాక రకాల రూమర్స్ వస్తున్న నేపథ్యంలో రాజ్ తరుణ్ వీటిపై స్పందించాడు. తన పై వచ్చే వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని, ప్రస్తుతం రెండు చిత్రాలురెండు సినిమాలు త్వరలో సెట్స్ పైకి రానున్నాయని తన ట్విట్టర్ పేజీ లో తెలిపాడు