Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2017 10:32:45
facebook Twitter Googleplus
Photo

మన స్టార్ డైరెక్టర్స్ పూరి జగన్నాధ్.. త్రివిక్రమ్ మాటలు ఎలా ఉంటాయో వాటి ప్రభావం ఎలా ఉందొ మనం గత దశాబ్దంగా చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వీళ్ళు ఇరువురు రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పైగా అవి ఒకే టైములో మాటల యుద్దానికి దిగేలా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ 25వ సినిమా పేరు ఇంకా కాకరు కాలేదు కానీ.. అసలు త్రివిక్రమ్ డైరక్షన్లో ఈయన సినిమా అంటేనే జనాలు పిచ్చిపిచ్చిగా థియేటర్లుకు వస్తారు. ఇంతకుముందు వచ్చిన జల్సా.. అత్తారింటికి దారేది సినిమాల్లో డైలాగ్స్ ఎంత ఫేమస్ అయ్యేయో తెలుసు కదా. తివిక్రం తన మాటలు ప్రాసలు తో ఎలా పదవిన్యాసం చేస్తాడో కొత్తగా చెప్పే పనిలేదు. ఇప్పుడు కూడా పవన్ కోసం అలాంటి తూటాలే రాసుంటాడని అంచనా. ఇక ఇటు బాలయ్య 101వ చిత్రం కూడా అంతే క్రేజీ ప్రాజెక్ట్. పూరి జగన్నాధ్ కథ.. మాటలు.. దర్శకత్వం చేస్తున్న సినిమా. పూరి డైలాగ్స్ కోసం యూత్ లో ఉండే పిచ్చి గురించి తెలిసిందే. ఈ సినిమా లో బాలయ్య గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. కథ ఎలా ఉన్నా కూడా డైలాగులు మాత్రం అదిరిపోయే ఛాన్సుంది.

సెప్టెంబర్ నెలలో ఈ రెండు సినిమాలు ఇంచుమించు వారం తేడా లో రిలీజ్ అయ్యే ఛాన్సుంది. అంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఈ సినిమాల మాటల తూటాలను చూసి దాదాపు ఒకే సమయంలో ఎంజాయ్ చేస్తారు.

,  ,  ,  ,  ,