Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2015 16:53:48
facebook Twitter Googleplus
Photo

స్వీటీ అనుష్క ప్రస్తుతం సైజ్ జీరో చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క ఈ మూవీలో లావుపాటి అమ్మాయిగా కనిపించబోతోంది. లావు తగ్గించుకుని జీరో సైజ్ కి మారాలంటే ఎలాంటి కష్టాల్ని ఎదుర్కోవాలి? అన్నది ఫన్నీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కె.రాఘవేంద్రరావు తనయుడు ఏ.ఎస్.ప్రకాశరావు (ప్రకాష్ కోవెలమూడి గతంలో) దర్శకత్వంలో పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం ఇంజి ఇదుప్పజగి.. పేరుతో తెరకెక్కుతోంది. ఈ నెల 27న తెలుగు - తమిళ్ లో రిలీజవుతోంది.

అయితే ఈ చిత్రంలో ఏకంగా ఏడుగురు టాప్ స్టార్స్ ఆర్య-అనుష్కతో పాటు కనిపించబోతున్నారన్నది తాజా అప్ డేట్. జీవా - హన్సిక ఈ ఇద్దరూ ఆర్యకి క్లోజ్ ఫ్రెండ్స్. ఈ జోడీ తో పాటు నాగార్జున - రానా - బాబి సింహా - కాజల్ - తమన్నా - శ్రీదివ్య - రేవతి .. ఇంత మంది స్టార్లు కనిపించనున్నారు. వీళ్లంతా ఆర్యకి - అనుష్కకి ఫ్రెండ్సుగా కనిపిస్తారని సమాచారం.

కథ ప్రకారం.. ఇంతమంది నటీనటులు అవసరమే. అందుకే వీళ్లంతా అంగీకరించారు. ఇంతకీ విషయం ఏమంటే ఆర్యతో పాటు బెంగళూర్ డేస్ లో నటిస్తున్న రానా - శ్రీదివ్య వంటి స్టార్లను కూడా కన్విన్స్ చేసి ఇందులో నటింపజేశారు. అటు పివిపి నిర్మిస్తున్న మల్టీస్టారర్ లో నాగార్జున -తమన్నా కలిసి నటిస్తున్నారు. దీన్నిబట్టి పీవీపీ నిర్మిస్తున్న ప్రెజెంట్ మూవీస్ లో నటీనటులంతా సైజ్ జీరోలో కనిపించబోతున్నారన్నమాట. ఈ సినిమాలన్నిటికీ ఒకటే ప్యాకేజీ కింద ప్రమోషన్ కూడా కుదురుతుంది. అదీ మ్యాటరు.

,  ,  ,  ,