Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2017 15:55:13
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాల్లో ఫైట్స్ హీరోలు కంటే డూపులు ఎక్కువ చేస్తారు అనేది ఒకప్పుడు మాట. ఇప్పుడు వస్తున్న హీరోలందరూ స్వయంగా చేయడానికి ఇష్టపడుతున్నారు. లేదంటే చూడటానికి రియల్ గా కనిపించదు అని వాళ్ళ భయం. ఒకప్పుడు హీరోలలో భాను చందర్ సుమన్ కరాటే తెలుసు. ఆ తరవాత మార్షల్ ఆర్ట్స్ తెలిసిన హీరోలు లేరనే చెప్పాలి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో తెలుగు తెర పై ఒక సంచలనం సృష్టించాడు పవన్ కళ్యాణ్ తన ఫైట్స్ తో. అప్పట్లో అదొక గొప్ప విన్యాసంగా తయారైంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఫీట్ చేస్తున్నాడట.

తన రాబోయే సినిమా కోసం కొత్త రకం ఫైట్స్ ప్లాన్ చేస్తున్నాడట పవన్. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో కొంచం యాక్షన్ ఎక్కువ ఉంటుందిట. దాని కోసం రవివర్మ ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. అతని తో పాటుగా మరో పెద్ద సౌత్ ఇండియా సెన్సేషన్ పీటర్ హెయిన్స్ కూడా ఒక ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. ఫారిన్ లోకేషన్లో ఒక ఫైట్ కోసం అక్కడే ఒక పేరున్న ఫారిన్ ఫైట్ మాస్టర్ తో కంపోజ్ చేయిస్తున్నారు.

విశేషం ఏంటంటే.. ఈ ఫారిన్ ఫైట్ సీక్వెన్స్ కోసం ఒక ఇంటర్నేషనల్ ఫైట్ మాష్టర్ ఇక్కడకు వచ్చి పవన్ కల్యాణ్ కు శిక్షణ కూడా ఇచ్చారుట. జల్సా సినిమా లో ఫైట్స్ కు మించి ఈ సినిమాలో ఉంటాయి అని చెపుతున్నారు.

,  ,  ,  ,  ,