Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 10:14:54
facebook Twitter Googleplus
Photo

డీజే- దువ్వాడ జగన్నాధం మూవీ చేస్తున్న అల్లు అర్జున్ ను.. ఇప్పుడు కొందరు భల్లాల దేవుడిగా మార్చేశారు. బాహుబలిలో భల్లాలకు.. బన్నీకి ఎక్కడా లింక్ లేదు కానీ.. జనాల క్రియేటివిటీ ఆ రేంజ్ లోకి చేరిపోయింది. అల్లు అర్జున్ ని భల్లాలతో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం బాగా ఎక్కువగానే జరుగుతోంది.

ఇంతకీ బన్నీని బాహుబలి విలన్ గా ఎలా మార్చారనే విషయం ఆసక్తికరంగానే ఉంది. బాహుబలి2 మూవీలో ఇంటర్వెల్ సీన్ ను పవన్ కళ్యాణ్ కు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ను బేస్ చేసుకుని రాసినట్లు రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఏ ఈవెంట్ లో అయినా సరే పవన్ పేరు వినిపిస్తే చాలు.. ఐదు నిమిషాల పాటు ఎవరినీ మాట్లాడనివ్వకుండా జనాలు అరవడాన్నే స్ఫూర్తిగా తీసుకుని ఈ సీన్ రాశానన్న విషయం తెలిసిందే. ఈ సీన్ లో జనాలు బాహుబలి అరుస్తుంటే.. భల్లాలదేవుడిగా రానా అసూయతో రగిలిపోతూ ఉంటాడు. ఆ అసూయకు సంబంధించిన లింక్ నే బన్నీకి అంటగట్టారు నెటిజన్లు.

గతేడాది సరైనోడు సక్సెస్ మీట్ లో పవన్ గురించి మాట్లాడమని ఆడియన్స్ కోరితే చెప్పను బ్రదర్ అంటూ బన్నీ అన్న మాట పెద్ద సెన్సేషన్ అయింది. పవన్ క్రేజ్ ఉన్న జెలసీతోనే ఇలా మాట్లాడాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగానే ఫిక్స్ అయ్యారు. అందుకే డీజే టీజర్ కు డిజ్ లైక్స్ ఆ రేంజ్ లో పడ్డాయి.

,  ,  ,  ,  ,  ,  ,  ,