Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2016 12:23:28
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి. ట్రెండ్ సెట్ చేసిన పవన్ గతంలో తమ్ముడు సినిమాద్వారా కొత్త హెయిర్ స్టైల్ ను తీసుకొచ్చాడు. ఆ తరువాత ఖుషి సినిమాలో కూడా పవన్ తనదైన స్టైల్ హెయిర్ స్టైల్ ను తీసుకోచ్చాడు. ఇక, ఖుషి సినిమాల తరువాత వచ్చిన సినిమా అన్నింటిలోను నార్మల్ హెయిర్ స్టైల్ ఉన్నది. ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఎస్ జె సూర్య, ఇప్పుడు పవన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నది. బ్రౌన్, లైట్ వైట్ కలర్ హెయిర్ తో చిన్న కటింగ్ తో పవన్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు తెలుస్తున్నది. ఇదే పవన్ హెయిర్ స్టైల్ అని మీడియాలను, సోషల్ మాధ్యమాలలోను ట్రెండ్ అవుతున్నది. సర్దార్ ప్లాప్ అయినా.. క్రేజ్ తగ్గలేదు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు.

,  ,  ,  ,  ,  ,  ,