Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2016 12:03:44
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడూ ఏడాదికో, ఏడాదిన్నిరకో ఓ సినిమా చేసే పవన్ వచ్చే మూడేళ్ళలలో వీలైనన్న సినిమాలు చేస్తానని ప్రకటించేశారు. అయినా ఎందుకో ఆయన సినిమా అనుకున్న సమయానికి పట్టాలెక్కటం లేదు. ఎస్‌.జె సూర్య సినిమా ప్రకటించి పూజా కార్యక్రమాల వేగం చూసేసరికి పవన్ ఈ ఏడాదిలోపే మరో సినిమా చేసి ?సర్దార్‌?తో నిరాశచెందిన అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతారనుకున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి ?కడప కింగ్? అని టైటిల్ అనుకున్న సంగతి తెలిసిందే. తీరా మెగాఫోన్ పట్టాల్సిన సూర్య కెమెరా ముందకొచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత సినిమా పరిస్థితి అనుమానంగా మారింది. ఇంతలో డాలీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కథని ఆకళింపు చేసుకుని తనదైన వెర్షన్‌ని రెడీ చేస్తున్నారట. ఈ నెలాఖరున తొలి షెడ్యూల్ మొదలవుతుందన్న ప్రచారం జరుగుతున్నా అది ఓ వారం రోజులకే పరిమితం కానుందని వినికిడి. తర్వాత సూర్య, పవన్ కలిసి వండిన కథకి డాలీ తిరగమోత పెడతారట. ఈ వ్యవహారమంత ఓ కొలిక్కి రావడానికి హీనపక్షం నెలన్నా పడుతుంది. ఆ లెక్కన కింగ్ రింగ్‌లో అడుగుపెట్టేది రెండు నెలల తర్వాతే. ఈలోపు డేట్ల విషయమై అటుఇటవుతోన్న శృతి కూడా ఫ్రీ అయిపోతుంది. అదీ మేటర్..!

,  ,  ,  ,  ,  ,  ,