Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Aug-2015 16:56:26
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై మొదట్నుంచి తాను హీరోగా సినిమాలు తీసుకుంటూ వస్తున్న కళ్యాణ్ రామ్ తొలిసారి బయటి హీరోను పెట్టి సినిమా తీశాడు. అదే.. కిక్-2. ఐతే వేరే హీరో అయినా రాజీ పడకుండా భారీగానే ఖర్చుపెట్టాడు. రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టి సినిమా తీసిన నిర్మాతగా కళ్యాణ్ రామ్ పేరు తెచ్చుకున్నాడు. దాదాపు 40 కోట్ల దాకా బడ్జెట్ అయినట్లు సమాచారం. ఐతే ముందు కొంచెం కంగారు పడ్డారు కానీ.. సినిమాకు అయిన బిజినెస్ చూస్తుంటే కళ్యాణ్ రామ్ సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఏరియాల వారీగా ఈ సినిమాకు మంచి బిజినెసే జరిగింది.

కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాను హోల్ సేల్ గా కొనేసి భారీగా లాభాలు మూటగట్టుకున్న దిల్ రాజు.. ఆ అభిమానంతో ?కిక్-2? మీద భారీగానే పెట్టుబడి పెట్టాడు. రూ.8.8 కోట్లు పెట్టి నైజాం రైట్స్ తీసుకున్నాడు. రవితేజ సినిమాల్లో నైజాం ఏరియా వరకు ఇది రికార్డు. ఇక సీడెడ్ రైట్స్ ని దేవి ఫిలిమ్స్ రూ.4.4 కోట్లకు కొనుక్కుంది. వైజాగ్ ఏరియాకు ఆర్.ఎస్.ఫిలిమ్స్ రూ.2.3 కోట్లకు కిక్-2 రైట్స్ తీసుకుంది. తూర్పు గోదావరికి రూ.1.6 కోట్లు పశ్చిమ గోదావరికి రూ.1.4 కోట్లు కృష్ణాకు రూ.1.6 కోట్లు నెల్లూరుకు రూ.1.1 కోట్లు గుంటూరుకు రూ.2.1 కోట్లకు చొప్పున హక్కులు అమ్మారు. మొత్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిపి 23.3 కోట్ల మేరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక హక్కుల్ని బృందా అసోసియేట్స్ సంస్థ రూ.2.8 కోట్లకు ఓవర్సీస్ రైట్స్ రూ.2.2 కోట్లకు క్లాసిక్స్ సుధీర్ కొనుగోలు చేశారు. తమిళనాడుకు రూ.25 లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.25 లక్షల మేర హక్కులు అమ్మారు. మొత్తంగా కిక్-2 థియేట్రికల్ బిజినెస్ రూ.28.8 కోట్లుగా తేలింది. శాటిలైట్ రైట్స్ రూ.7.2 కోట్లు పలికాయి. అంటే ఇప్పటికే రూ.36 కోట్ల దాకా వెనక్కి వచ్చేశాయి. సినిమాకు హిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ కు వచ్చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నమాటే.

,  ,  ,  ,