Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Apr-2016 11:47:18
facebook Twitter Googleplus
Photo

ఈ నెల ఎనిమిదిన విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ హంగామా ఇండస్ట్రీలో మొదలైపోయింది. అడ్వాన్స్ బుకింగులు కూడా స్టార్ట్ చేసేయడంతో.. అభిమానులు టికెట్లను బుక్ చేసేసుకుంటున్నారు. అయితే ఈ డేట్ ను అందుకోవడానికి సర్దార్ యూనిట్ చాలానే కష్టపడింది.

సర్దార్ గబ్బర్ సింగ్ కోసం రత్నాపూర్ సెట్ ను హైద్రాబాద్ లోనే వేశారు. 4-5 ఎకరాల ప్లేస్ లో వేసిన ఈ సెట్ లో పవన్ కోసం ప్రత్యేకంగా కార్వాన్ ఉంది. అయితే పవర్ స్టార్ అసలు తన కార్వాన్ ను ఉపయోగించుకున్నదే లేదంటారు. పోలీస్ స్టేషన్ సెట్ కు ఎదురుగా ఉన్న సెలూన్ లోనే పవన్ రిలాక్స్ అయ్యేవాడట. ఆర్థర్ విల్సన్ సాయంతో డైరెక్టర్ బాబీ ఓ యూనిట్ ని హ్యాండిల్ చేస్తే.. మరోవైపు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు.. ఫైటర్లపై యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరించేవారట.

రెండు యూనిట్లు అటో వైపు ఇటోవైపు తమ పని తాము చేసుకుంటుంటే.. పవన్ అటూ ఇటూ రెండు వైపులా పర్ఫెక్షన్ కోసం తిరిగేసే వాడని తెలుస్తోంది. అనుకున్న డేట్ కల్లా సినిమాని తెరపైకి తేవడంతో పాటు.. అసలు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అప్ డేట్స్ లీక్ కాకుండా.. రెండు స్టేజ్ లలో సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేశారు. ఏమైనా తాము అనుకున్న ముందుగా చెప్పిన డేట్ కే సర్దార్ ను సిల్వర్ స్క్రీన్ పైకి తెచ్చేస్తున్నాడు పవర్ స్టార్.

,  ,  ,  ,  ,  ,  ,