Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Dec-2017 11:46:16
facebook Twitter Googleplus
Photo

హలో. ఇది పరిచయం చేయనక్కర్లేని మాట. ఫోనున్న ప్రతి ఒక్కరి నోటి వెంట వచ్చే మాట. ఈ సినిమా టైటిల్ తోనే సగం మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అంటూ హలో సినిమా టీంను.. అక్కినేని ఫ్యామిలీని మెగాస్టార్ చిరంజీవి తన మాటల్తో మురిపించేశాడు. హలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన చిరు ఈ సినిమా చూశాకే ఈ ఫంక్షన్ కు వచ్చానని.. సినిమా మొత్తం వావ్ అనిపించేలా ఉందని చెప్పుకొచ్చారు.

హలో మాటకు అక్కినేని కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని చిరంజీవి చెప్పారు. హలో హలో ఓ అమ్మాయి అంటూ అప్పట్లో నాగేశ్వరరావు పాటతో హిట్ కొ్ట్టారని.. తరవాత హలో గురు ప్రేమకోసమే సాంగుతో నాగార్జున అమల జంట పాపులర్ అయిపోయిందని.. తరవాత హలో బ్రదర్ అంటూ నాగ్ హిట్ కొట్టాడని గుర్తు చేశారు. ఇప్పుడు అఖిల్ కూడా హలో అంటూ మన ముందుకొస్తున్నాడని చెప్పుకొచ్చారు. నేను ఈ సినిమా చూసి వచ్చా. రిలీజ్ కు ముందు చూడటం ఓ పరీక్ష లాంటిది. అబద్ధం ఆడలేం. లేనివి చెప్పలేం. కానీ ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు అందరినీ ఆకట్టుకునే క్లీన్ లవ్ స్టోరీ. ఇక యాక్షన్ సీన్స్ మార్వలెస్ గా ఉన్నాయి. అఖిల్ డ్యాన్సులు గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. ఇంతవరకు అక్కినేని ఫ్యామిలీలో ఎవరూ చేయలేని విధంగా పాట కూడా నాన్న.. తాతలను మించి నటుడు అవ్వాలని చిరంజీవి ఆకాంక్షించారు.

హలో సినిమా కో ఇన్సిడెన్స్ ల మీద ఆధారపడే సాగే స్టోరీ అని.. హీరోయిన్ కళ్యాణి విషయంలో అలాంటి కో ఇన్సిడెన్స్ జరిగిందని చిరు చెప్పారు. కొన్ని నెలల క్రితం హీరోయిన్ కళ్యాణి తన తల్లి లిజితో కలిసి తన ఇంటికి వచ్చిందన్నారు. లంచ్ తరవాత అన్నపూర్ణ స్టూడియోలో ఆడిషన్స్ కు వెళ్తున్నామని.. సెలక్ట్ అవుతానో లేదోనని చెప్పింది. అదే రోజు సాయంత్రం సెలక్ట్ అయ్యానని చెప్పింది.

,  ,  ,  ,  ,  ,  ,