Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2017 10:07:42
facebook Twitter Googleplus
Photo

ఏంటా పవన్ సినిమా కోసం అమెరికలో వెతకడం ఏంటి అనుకుంటున్నారా? ఇది పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమా కోసం కాదులేండి.. తొలిసారిగా ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కోసం. ఆయన ఇప్పటికే తనే హీరోగా చేస్తూ చాలా సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు.. కాకపోతే బయట హీరోతో తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఇంతవరకు ఒక్క సినిమా కూడా తీయలేదు. తొలిసారిగా నితిన్ హీరోగా.. త్రివిక్రమ్ మరియు నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి సహ నిర్మాతలుగా.. లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య డైరక్షన్లో ఒక సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఈ కథంతా.

సాధారణంగా పవన్ ప్రొడక్షన్.. త్రివిక్రమ్ మూల కథ అనగానే.. సినిమా అంతా కూడా ఇక్కడే ఏదన్నా పల్లెటూరులో తీస్తారేమో అనుకున్నారు అందరూ. తెలుగు నేపథ్యంలో సినిమా సాగుతందని ఆశించారు. కాని అనూహ్యంగా.. ఈ సినిమా మొత్తం అమెరికాలో తెరకెక్కనుంది. నిన్నటివరకు న్యూయార్క్ లో లొకేషన్ల కోసం వేట సాగించిన దర్శకుడు కృష్ణ చైతన్య.. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో వెతుకున్నాడు. ఈయనతో పాటు సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యం కూడా ఈ వేటలో పాలుపంచుకుటున్నాడు. గతంలో ఈయన అ..ఆ సినిమా కోసం కలర్ ఫుల్ విజువల్స్ అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఆమెరికానే కొత్తగా చూపిస్తాం అంటున్నారు వీరిరువురు.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియలేదు.

,  ,  ,  ,  ,  ,