Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-May-2016 13:19:22
facebook Twitter Googleplus
Photo

మొన్నామధ్య చడీచప్పుడు లేకుండా తన కొత్త సినిమాకు కొబ్బరి కాయ కొట్టేసిన పవర్ స్టార్.. ఇప్పుడు అలాగే సైలెంటుగా షూటింగ్ మొదలుపెట్టేస్తున్నాడు. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోతున్న కొత్త సినిమా షూటింగ్ జూన్ 2న పొల్లాచ్చిలో మొదలు కాబోతోంది. పవన్ కు కేరళ అంటే సెంటిమెంటు తన సినిమాల్లో ఒక్క సన్నివేశమైనా అక్కడ చేయాలని చూస్తుంటాడు. గబ్బర్ సింగ్.. సర్దార్ గబ్బర్ సింగ్.. రెండింట్లోనూ కేరళ సెంటిమెంటు కనిపిస్తుంది. ఎస్.జె.సూర్య సినిమాను నేరుగా పొల్లాచ్చిలో మొదలుపెట్టేస్తుండటం విశేషమే. గోపాల గోపాల.. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత వరుసగా పవన్ మూడో సినిమాను కూడా శరత్ మరారే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఈ చిత్రానికి శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.

ఈ సినిమాలో పవన్.. తమిళ స్టార్ హీరో అజిత్ తరహాలో సాల్ట్ అండ్ పెప్పర్ తో కనిపించబోతున్న సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. సర్దార్ షూటింగ్ అయిపోగానే మీసం తీసేసి.. సగం తెల్లబారిన జుట్టుతోనే కనిపించాడు పవన్. ఆ లుక్ తోనే సినిమా ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నాడు. ఇప్పుడిక పవన్ తాజా లుక్ ఒకటి బయటికి వచ్చింది. అందులో జుత్తుకు మధ్యలో ఒక చోట బ్రౌన్ కలర్ వేసినట్లు కనిపిస్తోంది. జుత్తు పైకి నిక్కబొడుచుకున్నట్లుంది. టీనేజ్ కుర్రాళ్లు మామూలుగా ఇలాంటి వింత హేర్ స్టైల్స్.. కలరింగ్ ట్రై చేస్తుంటారు. పవన్ కొంపదీసి సినిమాలోనూ ఈ హేర్ స్టైల్ తో కనిపిస్తాడా అని చర్చించుకుంటున్నారు అభిమానులు. నిజంగా ఆ లుక్కే కంటిన్యూ చూస్తే కామెడీ అయిపోతుందేమో అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,