Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2017 12:02:36
facebook Twitter Googleplus
Photo

పెళ్లిచూపులు సినిమాతో రాత్రికి రాత్రే మాంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. అంతకుముందే ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఆకట్టుకున్నప్పటికీ.. అతడి పేరు జనాల్లో రిజిస్టరవ్వలేదు. కానీ పెళ్లిచూపులు సినిమా అతడికి తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ దెబ్బతో అతడికి అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు అరడజను సినిమాలు అతడి ఖాతాలో చేరాయి. పెళ్లిచూపులు విడుదలకు ముందే విజయ్ ఓకే చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ చిత్ర టీజర్ కొన్ని నెలల కిందట రిలీజై సంచలనం సృష్టించింది. స్టన్నింగ్ గా అనిపించిన ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాల్ని పెంచేసింది.

ఈ తరం యూత్ ఆడియన్స్ అర్జున్ రెడ్డి టీజర్ తో భలే కనెక్టయ్యారు. సోషల్ మీడియాలో ఈ టీజర్ గురించి పెద్ద చర్చే జరిగింది. టాలీవుడ్లో ఇలా ఓ అప్ కమింగ్ హీరో సినిమా టీజర్ ఈ స్థాయిలో చర్చనీయాంశం కావడం అరుదు. అర్జున్ రెడ్డి అనే సినిమా అనౌన్స్ చేసినపుడు దానిపై జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు కానీ.. పెళ్లిచూపులుతో విజయ్ దేవరకొండ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రిలీజైన ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచింది. అప్పట్నుంచి సినిమా ఎప్పుడొస్తుందా అని యూత్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ టీజర్ వచ్చాక ఈ సినిమా గురించి అప్ డేట్ లేదు. సినిమా పూర్తయిందా.. ఇంకా షూటింగ్ జరుపుకుంటోందా.. ఏం తెలియదు. మళ్లీ ఈ సినిమాకు సంబంధించి ఏ విశేషం బయటికి రాలేదు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ అడ్వాంటేజీని వాడుకుంటూ సాధ్యమైనంత త్వరగా సినిమాను రెడీ చేస్తే మంచిది.

,  ,  ,  ,