Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2016 15:23:08
facebook Twitter Googleplus
Photo

అదేంటండీ.. అసలు పవర్ స్టార్ నటించే తదుపరి సినిమాల మీద అస్సలు క్లారిటీ లేదన్నారుగా. అబ్బే అదంతా కాదులే. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలతో రానున్నాడు. అందులో ఒక న్యూస్ పాతదే అయినప్పటికీ.. మిగిలిన రెండు సినిమాలూ ఇప్పుడు కన్ఫామ్ చేసేశారు.

ఎప్పటినుండో పవన్ తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లిన డైరక్టర్ దాసరి నారాయణరావుకు ఒక సినిమా చేస్తాడని అంటున్నారు. ఆ విషయంగా స్వయంగా దాసరి కూడా ప్రకటించారు. దాసరి ప్రొడక్షన్లో పవన్ సినిమాను ఎవరు తీస్తారో తెలియదు కాని.. ఈరోజు అఫీషియల్ గా దాసరి సొంత సంస్థ ''తారకప్రభు ఫిలింస్'' పవన్ తో తమ ప్రొడక్షన్ నెం.38 టేకాఫ్ అవుతున్నట్లు ప్రకటించింది. ఇకపోతే త్రివిక్రమ్ తదుపరి సినిమా కూడా పవన్ కళ్యాణ్ తోనే. వేరే ఏ హీరో తో చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ సొంత ప్రొడక్షన్ లాంటి కె.రాధాకృష్ణ బ్యానర్ 'హారికా అండ్ హాసిని' క్రియేషన్స్ బ్యానర్ ఈరోజున ''ప్రొడక్షన్ నెం.4'' అంటూ పవన్-త్రివిక్రమ్ సినిమా యాడ్ ఇచ్చేశారు.

మరి మూడో సినిమా ఏంటంటారా? ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ''కాటంరాయుడు'' యాడ్ చూడలేదేంటండీ.. అదేగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా. అయితే సినిమా మొదలైందా లేదా అనే సందేహం లేకుండా ఏకంగా టైటిల్ లోగో లుక్ కూడా రిలీజ్ చేశారు నిర్మాత శరత్ మరార్. మొత్తానికి పవన్ వరుస ప్లానింగ్ అదిరిపోయింది. ఫ్యాన్స్ కు ఇంతకంటే పెద్ద బర్త్ డే రిటర్న్ గిఫ్ట్ ఏముంటుంది.

,  ,  ,  ,  ,  ,