Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2017 11:23:37
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ ఈ రోజుల్లో ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయలకంటే ఎక్కువగా అయన కెరీర్ లో అపజయాలే ఉన్నాయి. అయినా కూడా పవన్ స్టార్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు. సినిమా సినిమాకు తన స్టార్ హోదాను పెంచుకుంటూ.. వెళుతున్నాడు. తనదైన శైలిలో సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ పేరు తెలియాని వారు ఉండరు. ఆయన అభిమానులను ఎవ్వరిని అడిగినా పవన్ కళ్యాణ్ పూర్తి చెప్పేస్తారు. కానీ ప్రస్తుతం గూగుల్ లో పవన్ కళ్యాణ్ పేరు టైప్ చేస్తే వేరొక పేరు వస్తోంది. పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ బాబు. కానీ వెండితెరపై అడుగులు వేసిన తర్వాత ఆయన పేరు పవన్ కళ్యాణ్ అయ్యింది. ప్రస్తుతం గూగుల్ లో పవన్ కళ్యాణ్ అని టైప్ చేస్తే మాత్రం పక్కనే 'కుషాల్ బాబు' అని చూపిస్తోంది. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి పవన్ కళ్యాణ్ పేరు మార్చుకున్నాడా? అని ట్విట్టర్ లో ఒకసారి మళ్లీ చూస్తున్నారు.

అన్నిట్లోనూ పవన్ కళ్యాణ్ అని పేరు ఉంది. ఇక సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ పేరు మార్చుకున్నాడని రూమర్స్ వస్తున్నాయి. అది కూడా త్రివిక్రమ్ మార్చాడని కథనాలు వెలువడుతున్నాయి. ఇక వికీపీడియాలో కూడా పవన్ కళ్యాణ్ అనే ఉంది.

,  ,  ,  ,  ,