Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2016 12:24:44
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నాడు? అదేదో డిఫరెంట్ గెటప్ తో కొన్ని రోజుల క్రితం ఓ సారి కనిపించాడు. బాగా షార్ట్ చేసేసిన హెయిర్ మధ్యలో బ్రౌన్ కలర్ డై వేసిన కొంచెం జుట్టు కనిపించీ కనిపించకుండా మీసం. ఇలా సంథింగ్ న్యూ లుక్ తో కనిపించాడు పవన్. ఆ తర్వాత సమ్మర్ వెకేషన్ వెళ్లాడని అన్నారు. ఇంతకీ వేసవిలో పవన్ చుట్టేస్తున్న ప్రదేశాలు ఏంటో తెలుసా?

మొదటగా అయితే తన మాజీ భార్య దగ్గర ఉన్న ఇద్దరు పిల్లల దగ్గరకు వెళ్లాడు పవన్ కళ్యాణ్. పూనేలో ఉంటున్న రేణూ దేశాయ్ దగ్గరకు వెళ్లిన పవన్.. అక్కడ పిల్లలతో కలిసి దాదాపు పది రోజులు ఎంజాయ్ చేశాడు. అక్కడి నుంచి నేరుగా రష్యా వెళ్లాడని తెలుస్తోంది. తన భార్య అన్నా లెజెనోవా - కూతురుతో కలిసి రష్యా టూర్ వెళ్లాడు పవన్. రష్యా అంటే.. పవన్ వైఫ్ కి పుట్టిల్లు అన్నమాట.

ఇక పవన్ లుక్ విషయానికొస్తే.. ఎస్ జే సూర్యతో చేయబోతున్న హుషారు కోసమే.. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అనే టాక్ వినిపించింది. నిజానికి అలాంటిదేమీ లేదట. పవన్ ఇప్పటివరకూ లుక్ పై దర్శకుడితో మాట్లాడటలేదట కూడా. కేవలం ఇదో డిఫరెంట్ ట్రయల్ అంతే అంటున్నారు సన్నిహితులు. సర్దార్ తర్వాత కొత్త సినిమా స్టార్ట్ చేసేలోపు.. ఖాళీ టైంలో పవన్ కొత్త లుక్ ట్రై చేశాడన్న మాట.

,  ,  ,  ,  ,