Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Oct-2015 13:53:47
facebook Twitter Googleplus
Photo

సర్దార్ గబ్బర్ సింగ్ ఏమైంది? అసలు షూటింగ్ జరుగుతోందా ? ఆగిపోయిందా ? ఇన్నాళ్లూ కేబీసీలో క్వశ్చన్స్ మాదిరిగా ఇవన్నీ డౌట్సే. కానీ వాటన్నిటికీ ఒకేసారి సమాధానం దొరికేసింది. పవన్ ఏ మాత్రం పేస్ తగ్గించలేదనే విషయం తెలిసిపోయింది.

డైరెక్టర్ బాబీ మేకింగ్ పై పవర్ స్టార్ అసంతృప్తిగా ఉన్నాడని ఓ టాక్ వినిపించింది. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ విన్సెంట్ ఎగ్జిట్ తర్వాత విల్సన్ ఎంట్రీ కారణంగా బాగా లేట్ అయిపోయిందని వార్తలొచ్చాయి. అసలు పవన్ పట్టించుకోవడం మానేశాడని కూడా రూమర్స్ వినిపించాయి. రీస్టార్ట్ ఎప్పుడు చేస్తారో ఎన్నాళ్లకు విడుదలవుతుందో అనే డౌట్స్ రెయిజ్ అయ్యాయి.

కానీ ఇప్పుడు పవన్ ని చూశాక సీన్ మారిపోయింది. ఇదంతా శంకరాభరణం నిఖిల్ చలవే. టీజర్ ని పవన్ చేతుల మీదుగా లాంఛ్ చేయిస్తానని ముందురోజే ట్విట్టర్ లో చెప్పిన నిఖిల్.. అన్నట్లుగానే సర్దార్ సెట్స్ కి వెళ్లి మరీ లాంఛ్ చేశాడు. ఇక్కడ పవన్ కూడా.. తన సినిమా గబ్బర్ సింగ్ లుక్ తోనే దర్శనమిచ్చాడు. రఫ్ గా పై మూడు గుండీలు తీసేసిన ఖాకీ షర్ట్ వేసుకునే.. శంకరాభరణం టీజర్ లాంఛ్ చేసేశాడు. పవన్ హుషారు ఎనర్జీ చూస్తుంటే.. సర్దార్ గబ్బర్ సింగ్ ఏ మాత్రం స్లో అవలేదని అర్ధమవుతుంది.

పవర్ ఫుల్ కాప్ పాత్రలో పవర్ స్టార్ నటిస్తున్న.. పవర్ ప్యాక్డ్ మూవీ.. ముందు చెప్పినట్లుగా సంక్రాంతికి సడెన్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదనే టాక్స్ మొదలైపోయాయిప్పుడు.

,  ,  ,  ,