Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2016 12:38:48
facebook Twitter Googleplus
Photo

బాహుబలిలో యుద్ధ సన్నివేశాలను ఎంతగా రక్తి కట్టించాయో మొదటి భాగంలో చూశాం. సినిమా మొత్తానికి ఈ సీన్స్ చాలా కీలకంగా నిలిచాయి. టాలీవుడ్ స్థాయిని ఎన్నో మెట్లు ఎక్కించడంలో బాహుబలి క్లైమాక్స్ చాలా ఉపయోగపడింది. బాహుబలి ది కంక్లూజన్ లోనూ యుద్ధం సీన్స్ ను మెస్మరైజ్ అయ్యేలా తీసేందుకు రాజమౌళి సిద్ధమయ్యాడు. అమెరికా - బల్గేరియాల్లో వీటిని చిత్రీకరించేదుకు మొదట ప్లాన్ చేసినా ఇప్పుడు మాత్రం హైద్రాబాద్ లోనే భారీ సెట్స్ వేసి యుద్ధం చేయించేస్తున్నాడు.

బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతమంతా ఇప్పుడు జై మాహిష్మతి అనే నినాదాలతో మార్మోగిపోతోంది. ప్రస్తుతం ప్రభాస్ పైనే ఈ భారీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బాహుబలి సీక్వెల్ మొత్తంలో ఇప్పుడు చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్ హైలైట్ గా నిలుస్తుందనే అంటున్నారు. కెచా మాస్టర్ ఆధ్వర్యంలో ఈ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది.

మంచుకొండల్లోనూ కొన్ని ఫైట్ సీన్స్ తీయాల్సి ఉందని తెలుస్తోంది. వీటి కోసం విదేశీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నా.. ఇప్పుడు మాత్రం వీటిని లోకల్ గానే కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యిందట బాహుబలి యూనిట్. కాకపోతే.. భారీ సెట్టింగులు వేసి షూటింగ్ చేయనున్నారని అంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ చేయనున్నట్లు.. జక్కన్న ఇప్పటికే చూచాయగా చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,