పవన్ కల్యాణ్ ఇకపై పారితోషికం తీసుకోడట.... అలాగని కంగారుపడకండి. పారితోషికం స్థానంలో వాటా తీసుకునే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. 'గోపాల గోపాల' సినిమాకి ఆయనిలాగే పారితోషికం తీసుకోకుండా, లాభాల్లో వాటా తీసుకున్నాడు. అది బాగానే వర్కౌట్ అయింది. దాంతో ఇప్పుడు 'గబ్బర్ సింగ్ 2' చిత్రానికి కూడా అలాగే షేర్ మాట్లాడుకున్నాడట. లాభాల్లో ఫిఫ్టీ పెర్శేంట్ చొప్పున తీసుకుంటాడనీ, ఇకపై అన్ని సినిమాలకూ దీనిని వర్తింపజేస్తారనీ వార్తలు వినిపిస్తున్నాయి. అలా ఏభై శాతం షేర్ తీసుకోవడం వల్ల ఎంత లేదన్నా పవన్ వాటాకు 20 కోట్ల వరకూ వస్తాయట!
pawankalyan, gabbersingh2, sharatmarar, bobby, shareinprofits,