Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Nov-2016 10:47:49
facebook Twitter Googleplus
Photo

పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసేయడం బడా బాబులను బాగానే టెన్షన్ పెడుతోంది. మరోవైపు చేతిలో ఉన్న డబ్బులను డిపాజిట్ చేసుకోవచ్చనే ఆప్షన్ ఉన్నా.. ఎవరి ఎకౌంట్ లో డబ్బులు వేసుకోవడానికి అవకాశం ఉన్నా.. అకౌంట్ గల వ్యక్తులే బ్యాంకుకు వచ్చి డిపాజిట్ చేయాలనే రూల్ ఉంది. దీంతో అందరూ బ్యాంకుల బాట పట్టక తప్పలేదు.

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే నోట్లు మార్చుకోవడానికి వచ్చాడంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ బ్యాంక్ లో కూర్చుని ఉన్న పవన్ కనిపిస్తాడంతే. అది బ్యాంకే కాని.. విషయం ఏంటంటే.. ఇప్పటి ఫోటో కాదు. కొన్నేళ్ల క్రితం తీసిన పిక్ అని పవన్ లుక్ చూస్తేనే అర్ధమవుతుంది. ప్రస్తుతం కాటమరాయుడు చిత్రం కోసం హెయిర్ స్టైల్ సహా పూర్తిగా మార్చేసి.. పవన్ కొత్త లుక్ లో ఉన్నాడు. కానీ.. ఇప్పుడు బయట ఉన్న సిట్యుయేషన్ లో ఇలాంటివేమీ పట్టించుకోకుండా.. పవనే ఇలా నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుకు వచ్చాడంటూ హంగామా నడుస్తోంది.

పేరు మోసిన మీడియా సంస్థలు కూడా ఇదే టైపులో వార్తలు వేసేస్తుండడమే ఆశ్చర్యకరం. ఇప్పటికే పవన్ సన్నిహితులు కూడా.. ఇది పాత ఫోటో అంటూ పుకార్లను కొట్టిపడేస్తున్నారు. ఇక సినిమాల సంగతి చూస్తే.. కాటమరాయుడు తర్వాత పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మూవీ ప్రారంభం కానుంది.

,  ,  ,  ,  ,  ,