Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jan-2017 12:13:08
facebook Twitter Googleplus
Photo

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసే వైనం దర్శకుడు రాంగోపాల్ వర్మ సొంతం. విషయం ఏదైనా.. వ్యక్తి ఎవరన్నది పట్టించుకోకుండా వ్యాఖ్యలు చేసేస్తుంటారు. ఆకాశానికి ఎత్తేయాలన్నా.. పాతాళానికి తొక్కేయాలన్న ఏ మాత్రం సంకోచించరు. ఆ రోజుకి..ఆ టైంకు ఆయనకు ఏమనిపిస్తే దాన్నిట్విట్టర్ లో ట్వీట్ చేసి పారేసే వర్మ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అస్సలు అర్థం కానిది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇప్పటికే పలుమార్లు పొగుడుతూ.. తెగుడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నిఇన్ని కావు. కానీ.. ఎప్పుడూ వర్మ గురించి పవన్ మాట్లాడింది లేదు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో విశాఖ శాంతి నిరసనకు సంబంధించి వర్మ చేసిన ట్వీట్ల గురించి ప్రస్తావించిన సందర్భంగా వర్మ మీద సంచలన వ్యాఖ్య చేశారు పవన్.

చాలా సింఫుల్ గా రియాక్ట్ అయినట్లుగా కనిపించినా.. చాలా ఘాటైన మాటల్ని శాంతంగా చెప్పి.. వర్మ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీశారని చెప్పాలి. వర్మ వ్యక్తిగత విషయాన్ని ఎవరూ టచ్ చేయని కోణాన్ని టచ్ చేసిన పవన్ కల్యాణ్ చెప్పిన మాటల్ని చూస్తే.. ??ఆయనకు యాభై ఏళ్లు. ఆయనకు ఒక కూతురుంది. ఆయన కూతురు పెళ్లి కూడా చేశారు. పెళ్లి అయిన కూతుర్ని పెట్టుకొని.. తాను పోర్నోగ్రఫీ కలెక్షన్ చేస్తుంటానని చెప్పిన వ్యక్తి. ఒక రోజు ఎత్తేస్తాడు. ఇంకో రోజు దించేస్తాడు. అలాంటి వ్యక్తి చెప్పే మాటలకి ఏం మాట్లాడాలి?? అంటూ సింఫుల్ గా తేల్చేశారు. వర్మను చాలామంది విమర్శించినా.. తప్పు పట్టినా.. పవన్ స్థాయిలో ఇప్పటివరకూ ఏసుకోలేదని చెప్పక తప్పదు.

,  ,  ,  ,  ,  ,