Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Nov-2015 18:03:28
facebook Twitter Googleplus
Photo

హార్రర్ కథలపై ఇదివరకు చిన్న చూపుండేది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కే చిన్న సినిమాల్లే అంటూ లైట్ తీసుకొనేవాళ్లు. కానీ ప్రేమకథా చిత్రమ్ లాంటి సంచలనాత్మక సినిమాల తర్వాత వాటిపై స్టార్ కథానాయకులు సైతం ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. ఒకసారి మనమూ భయపెడదామా అంటూ ఆ తరహా కథల గురించి ఆరా తీస్తున్నారు. కాస్త భయపెట్టినా సరే ఆ చిత్రాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు మరి. తక్కువ వ్యయంతోనే తెరకెక్కుతాయి. కానీ భారీగా లాభాలు తెచ్చిపెడతాయి. అందుకే దర్శకనిర్మాతలు మనమూ ఒకసారి ట్రై చేస్తే పోలా అంటూ ఆ కథలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కథానాయకుల్నీ ఒప్పిస్తున్నారు.

ఒకప్పుడు కుటుంబ కథలకి కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా దూసుకెళ్లిన కథానాయకుడు శ్రీకాంత్ కూడా ఇప్పుడు హార్రర్ జోనర్ లోకి అడుగుపెట్టేశాడు. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో శ్రీకాంత్ కథానాయకుడిగా ఓ హారర్ కామెడీ కథ తెరకెక్కింది. ఎవ్వరికీ తెలియదు కానీ... ఇప్పటికే ఆ సినిమా చిత్రీకరణని పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదల కాబోతోంది. ఇటీవల హైదరాబాద్ లో శ్రీకాంత్ విలేకర్లతో మాట్లాడుతూ ఆ విషయాన్ని ధృవీకరించారు. ``నేను కుటుంబ కథల హీరోనే కావొచ్చు. కానీ మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని కూడా గుర్తించాలి. ఇటీవల హార్రర్ సినిమాల్ని జనం చూస్తున్నారు కాబట్టి నేను కూడా ఆ తరహాలో ఓ సినిమా చేశా`` అన్నాడు శ్రీకాంత్. అమ్మ రాజశేఖర్ ఇదివరకు మాస్ మసాలా సినిమాలు తీశాడు. మరి ఆయన హార్రర్ కథని ఎలా డీల్ చేశాడో చూడాలి.

,  ,  ,  ,