Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Feb-2017 10:50:10
facebook Twitter Googleplus
Photo

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన అమెరికా పర్యటనలో భాగంగా న్యూ హ్యామ్ షైర్ లోని నౌషలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆద్యంతం అభిమానులను హుషారెత్తించేలా సాగింది ఆయన స్పీచ్. ఈ స్పీఎస్ లో పవన్ పలు ఆసక్తికరమైన విశేషాలను తెలియజేశాడు. ముఖ్యంగా తన సినీ జీవితం గురించి చెప్పిన మాటలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
తనకు సినిమాల్లో నటించడం కన్నా సమాజాన్ని చదువడం అంటే ఇష్టమని, తానొక స్కూల్ డ్రాప్ అవుట్ అని, అయినా ఇప్పటికీ తాను నిత్య విద్యార్థినే అని చెప్పిన పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం తనకు సౌకర్యంగా ఉండదని, పెద్దగా సంతృప్తి ఇవ్వదని చెప్పి సమాజానికి ఉపయోగపడే పనులేవైనా చేసినప్పుడే కాస్త రిలీఫ్ గా ఫీలవుతానని అన్నారు. అలాగే రాష్ట్ర, దేశ రాజకీయాల పట్ల తన స్పష్టమైన వైఖరిని కూడా వ్యక్తం చేశారు.

,  ,  ,  ,  ,  ,