Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2017 10:23:06
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్- హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న డీజే- దువ్వాడ జగన్నాధం.. మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రాల రిలీజ్ విషయంలో కన్ ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి ఈ రెండు సినిమాలు సమ్మర్ కే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ.. బాహుబలి2 కారణంగా పోస్ట్ పోన్ చేసుకున్నారు.

పనులు కూడా అందుకు తగ్గట్లుగానే జరుగుతున్నాయి. ఇప్పుడు జూన్ 23వ తేదీన బన్నీ డీజే.. మహేష్ స్పైడర్ లు పోటీ పడనున్నాయనే టాక్ హల్ చల్ చేస్తోంది. ఈ డేట్ ని మహేష్ ముందే చెప్పగా.. ఇప్పుడు బన్నీ పోటీకి వస్తున్నాడని అంటున్నారు. అయితే.. అసలు నిజం ఏంటంటే మహేష్ మూవీ షూటింగ్ లేట్ అవుతోందనే వార్తల కారణంగానే.. బన్నీ ఆ డేట్ పై గురి పెట్టాడు తప్ప.. స్పైడర్ తో పోటీ పడాలనే ఉద్దేశ్యంతో కాదనే విషయం సుస్పష్టం.

నిజానికి మహేష్ మూవీకి కొన్ని సన్నివేశాలు.. రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉండగా.. డీజేకు మాత్రం ఏకంగా క్లైమాక్స్ ను రీరైట్ చేస్తున్నారని.. కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఈ పరిస్థితిలో అల్లు అర్జున్ కంటే ముందే మహేష్ రావచ్చని టాక్.

,  ,  ,  ,  ,  ,  ,