Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2017 11:19:47
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసినదే. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక చిత్రం మొదలుకానుందని తుపాకీ ఇప్పటికే వెల్లడించింది. ఆ కాంబినేషన్ పై మరిన్ని వివరాలు మీకోసం..

జల్సా - అత్తారింటికి దారేది సినిమాల విజయాల తరువాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. సమాచారం ప్రకారం ఈసారి పొలిటికల్ థ్రిల్లర్ తో అలరించనున్నారు. పవన్ కి రాజకీయపరంగా కూడా ఈ క్యారెక్టర్ సపోర్ట్ చేయనున్నట్టు అందరి వుద్దేశం.

ఏకధాటిన షూటింగ్ పూర్తిచేసి ఆగష్టు 11న ఈ చిత్రం విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. కీర్తి సురేష్ - అను ఇమాన్యుయల్ హీరోయిన్లగా కనువిందు చేయనున్నారు.

,  ,  ,  ,  ,  ,