Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2017 10:53:20
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెగ బిజీగా ఉన్నాడు. అటు తన మూవీ కాటమరాయుడు షూటింగ్ ను పూర్తి చేస్తూనే.. మరోవైపు రాజకీయంగానూ యాక్టివ్ గా ఉంటున్నాడు. అయితే.. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ పవన్ పై కాస్త గుర్రుగా ఉన్న మాట వాస్తవమే. మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ హాజరు కాకపోవడం అభిమానులను బాగా నిరుత్సాహపరిచింది.

అయితే.. మూవీ రిలీజ్ కి ముందు ఓ ట్వీట్ ద్వారా చిరంజీవికి.. ఆయన భార్య సురేఖకు.. రామ్ చరణ్ కు అభినందనలు తెలిపాడు పవన్. తాజాగా ఖైదీ నంబర్ 150 మూవీని పవన్ స్పెషల్ గా స్క్రీనింగ్ వేయించుకుని మరీ చూశాడనే టాక్ ఉంది. వీటన్నిటితో పాటు.. ఇప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. ఖైదీ సక్సెస్ తో పాటు.. మెగాస్టార్ కంబ్యాక్ ను అభినందించాడట పవన్. అంతే కాదు.. కొన్ని గంటల పాటు వదినమ్మ సురేఖతో మాట్లాడాడట కూడా.

తను ఎంత బిజీగా ఉన్నా అన్నయ్య ఫ్యామిలీతో కలిసి ఉన్నంతసేపు ఏ మాత్రం డిస్టర్బెన్స్ లు లేకుండా జాగ్రత్తలు తీసుకుని.. వీలైనంత సమయం గడిపాడట పవర్ స్టార్. ఆ తర్వాత యథావిధిగా తన కాటమరాయుడు షూటింగ్ కి పవర్ స్టార్ వెళ్లిపోయాడని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,