Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-May-2017 12:05:46
facebook Twitter Googleplus
Photo

బాహుబలి బ్రహ్మాండమైన విజయం తరువాత అందులో ముఖ్య తారాగణం ప్రపంచ నటులుగా గుర్తింపు పొందారు. బాహుబలి పోస్టర్ బోయ్ ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమాతో విదేశాలలో కూడా అభిమానులును సంపాదించుకున్నాడు. పాకిస్తాన్ - చైనా - జపాన్ - యూఎస్ ఇలా విడుదలైన ప్రతీ చోట భారీ విజయం సాధించింది. అందుకు రుజువుగా ఇప్పుడు ప్రభాస్ ఒక స్మార్ట్ ఫోన్ మొబైల్ కంపెనీ కి ప్రచారకర్తగా చేయబోతున్నాడు.

చైనా దేశంలో షెంజ్ హెన్ సిటీ కి చెందిన జీ ఒన్ అనే మొబైల్ కంపెనీ కి ఇండియా లో బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభాస్ ను ఎన్నుకున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ వలనే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది. ప్రచారం కోసం టివిసి యాడ్స్ - ప్రింట్ - డిజిటల్ - ఔట్ డోర్ లాంటి మీడియం లో ప్రభాస్ ఇంకా కనిపించబోతున్నాడు. ప్రభాస్ ఇప్పుడు యూఎస్ ట్రిప్ లో ఉన్నాడు అతను వచ్చిన వెంటనే ఈ విషయం అధికారకంగా వెల్లడించవచ్చు.

ప్రభాస్ లాంటి స్టార్స్ ప్రచారంతో ఈ మొబైల్ ఫోన్ ఎక్కువ మంది చేరుతుందిని జీ ఒన్ భావిస్తుంది. చైనా తరువాత ఎక్కువ మొబైల్ సేల్స్ ఉన్నది మనదేశమే కాబట్టి ఇప్పుడు మొబైల్ కంపెనీలు ఇండియా మార్కెటింగ్ పై ఎక్కువ ధృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు చాలా మొబైల్ కంపెనీలు మైక్రో మాక్స్ వివో లాంటివికూడ ఎక్కువ బడ్జెట్ మార్కెటింగ్ పై కేటాస్తున్నాయి. బాహుబలి సినిమా మొదలైన తరువాత ప్రభాస్ కి వచ్చిన అతి పెద్ద బ్రాండ్ ఇదే.

,  ,  ,  ,  ,  ,