Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Sep-2017 11:46:04
facebook Twitter Googleplus
Photo

ఇండస్ట్రీలో హీరోయిన్లు చాలా తరచుగా వాడే మాట ఇది. కాకపోతే హాట్ హాట్ ఫోజులివ్వడంపైనో.. క్లీవేజ్ సోకులు చూపడం గురించో... అదీ కాకుంటే లిప్ కిస్ లు ఇవ్వడాన్ని సమర్ధించుకుంటూనో ఈ డైలాగ్ చెప్పేస్తారు. డీగ్లామర్ రోల్ చేయాల్సి వస్తే చాలామంది సింపుల్ గా సారీ చెప్పేస్తారు. కానీ రంగం ఫేం హీరోయిన్ పియా బాజ్ పాయి మాత్రం ఈ మాట సీరియస్ గానే చెబుతోంది.

రంగం సినిమా సూపర్ హిట్టయినా హీరోయిన్లకు పెద్దగా క్రేజ్ ఏమీ రాలేదు. ఆ సినిమాలో పియా బాజ్ పాయి సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆమె నటన బావుందనే పేరు కూడా వచ్చింది. కానీ తర్వాత పెద్దగా ఛాన్సులేం రాలేదు. రీసెంట్ గా పియా అభియం అనువుం అనే తమిళ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా కోసం గుండు చేయించుకుంది. రంగం సినిమాలో రింగులు తిరిగిన జుట్టుతో చెంగుచెంగుమంటూ నటించిన ఈ భామను అస్సలు జుట్టు లేకుండా చూసి అంతా షాకైపోయారు. ఇదేమిటి పియా అని ప్రశ్నిస్తే ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం తాను జుట్టు లేకుండా కనిపించాల్సి ఉంటుందని చెప్పింది. అందుకే గుండు చేయించుకోవడానికి తాను ఏ మాత్రం వెనుకాడలేదంటోంది. తన కొత్తలుక్ తో ఉన్న ఫొటోలను ఉత్సాహంగా షేర్ చేస్తోంది.

రంగం తర్వాత పియా ఓ తెలుగు సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది. నవీన్ చంద్ర హీరోగా నటించిన అరణ్యం మూవీలో కనిపించింది. తర్వాత బాలీవుడ్ లో బ్రేక్ దొరుకుతుందేమోనని అక్కడా ట్రై చేసింది. హిందీలో నటించిన మీర్జా జూలియట్ సినిమా అట్టర్ ఫ్లాపయింది.

,  ,  ,  ,  ,