Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2017 09:39:18
facebook Twitter Googleplus
Photo

అజ్ఞాతవాసి అంటూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మొదట ఇది వర్కింగ్ టైటిల్ అన్నారు కానీ.. ఇప్పుడిదే ఫైనల్ అయిపోయింది. అయితే.. సినిమా టైటిల్ విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. ఈ విషయం పవన్ తో రూపొందించిన గత చిత్రం అత్తారింటికి దారేదితోనే అర్ధమైంది.

పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ హీరోకి ఇంతటి సాఫ్ట్ టైటిల్ ను డిసైడ్ చేసి.. ఒప్పించడమే ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు అజ్ఞాతవాసి అంటూ పేరు పెట్టడం వెనుక కూడా.. కారణాలను విశ్లేషించుకుంటున్నారు జనాలు. పురాణాలపై ఏమాత్రం అవగాహన ఉన్నా అజ్ఞాతవాసం అంటే పాండవులు గుర్తుకురావడంలో ఆశ్చర్యం లేదు. తమవారికి తెలియకుండా ఏడాదిపాటు అజ్ఞాతవాసం చేశారు పాండవులు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కూడా పవన్ పాత్ర ఇలాగే ఉంటుందట. కుటుంబం కోసం.. అదే కుటుంబానికి దూరమైపోయి.. చివరకు కలుసుకుంటాడట. అందుకే ఇలా అజ్ఞాతవాసి పేరు పెట్టారన్నది ఓ టాక్ అయితే.. సెంటిమెంటే అసలు రీజన్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ టాక్ కూడా వినిపిస్తోంది.

పవన్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అత్తారింటికి దారేది మూవీ అ అనే అక్షరంతో మొదలవుతుంది. ఇప్పుడు అజ్ఞాతవాసి కూడా అంతే. ఆ సినిమా అప్పటివరకూ ఉన్న రికార్డులన్నీ తుడిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజ్ఞాతవాసి టార్గెట్ కూడా అదే. ఆ సెంటిమెంట్ తోనే అజ్ఞాతవాసి అంటున్నారట.

,  ,  ,  ,  ,