Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Nov-2017 12:42:30
facebook Twitter Googleplus
Photo

మనిషికి చావు తప్పదన్నట్టు.. ప్రతి సినిమాకి పైరేసి దెబ్బ కూడా తప్పదు. ఇది ఎంత అబద్దం అన్నా.. ప్రతి సినిమా పైరేసి జబ్బు ను ఎదుర్కోవాల్సిందే. ఈ రోజుల్లో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా విడుదలకు ముందు హైప్ క్రియేట్ చేసినా కూడా రిలీజ్ అయిన సెకండ్ షోకే సినిమాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. సినిమా వాళ్లు ఎంత మొత్తుకున్నా అప్పటివరకూ హంగామా. ఆ తర్వాత మళ్లీ అదే తంతు.

పైరేసి దెబ్బ ఎలాగో తప్పదు అనుకుంటే విడుదలకు ముందు అంతా సిద్ధం చేసుకుంటే లీకేజీల గొడవ ఒకటి. ఏకంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ నిర్మాతలకు గుండెపోటును తెప్పిస్తున్నాయి. ఇకపోతే రీసెంట్ గా లక్ష్మి రాయ్ సినిమాకు కూడా ఈ తరహా ఇబ్బందులు తప్పలేవు. అమ్మడు మొదటి సారి బాలీవుడ్ లో అడుగుపెడుతూ జూలీ 2 అనే బోల్డ్ సినిమాను చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందనే టాక్ కూడా వచ్చింది.

కానీ ఈ సినిమా విడుదలకు ముందే కొన్ని సీన్స్ లీక్ అయ్యాయి. అప్పుడే అమ్మడు చాలా బాధపడింది. రిలీజ్ కు ముందే లీక్ అవ్వడమా నిజంగా దారుణమని కామెంట్ చేసింది. ఇక నిన్న రిలీజ్ అయిన సినిమా పైరేసి కూడా మాట్ని షో టైమ్ కి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది.

,  ,  ,  ,  ,  ,