Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Aug-2015 13:11:33
facebook Twitter Googleplus
Photo

పొలిటీషియన్లు సినిమాలు చూడడం వాటిపై కామెంట్లు చేయడం ఓ ట్రెండ్ అయిపోయింది. మీడియా ముందు ఫేస్బుక్ ట్విట్టర్ లో రాజకీయనేతల కామెంట్లు సినిమాకి కలిసొచ్చేవే. ఇటీవలి కాలంలో ఓ రెండు పెద్ద సినిమాల విషయంలో బడా నేతలు తమ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడం ఆ సినిమాలకు ఓ రేంజులో కలిసొచ్చింది.

బాహుబలి దేశంలోనే నంబర్ 1 సినిమాగా పేరు తెచ్చుకుంది. పీఎం నరేంద్ర మోడీని కలిసి ఈ సినిమా చూడాలని రెబల్స్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కోరారు. అందుకు మోడీ సైతం సరేనని అన్నారు. అప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కేసీఆర్ బాహుబలి సినిమా చూసి ప్రశంసలు కురిపించారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఈ సినిమా చూసి బావుంది బావుంది అంటూ తమవంతు ప్రచారం చేసేశారు. ఇలా ముఖ్యులంతా తలో చెయ్యి వెయ్యడంతో బాహుబలి కలెక్షన్లు బాగానే పెరిగాయి.

అలాగే ఇటీవలే మహేష్ నటించిన శ్రీమంతుడుకి ఓ తెలంగాణ మంత్రి సపోర్ట్ చేశారు. ఆయన ఈ సినిమా గురించి చెప్పిన సంగతులు జనాల్లోకి బాగానే వెళ్లాయి. సెలబ్రిటీలు ముఖ్యులు ప్రచారం చేయడం వల్ల సదరు సినిమాకి కలెక్షన్లు బాగానే పెరుగుతున్నాయి. ఇదో రకం కొత్త ట్రెండ్ అనే చెప్పాలి. అయితే అందరు హీరోలకు ఈ సపోర్ట్ వర్తించదు. కొద్దిమందికే ఆ అవకాశం.

,  ,  ,