Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2017 13:31:54
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ నటిస్తున్న డీజే- దువ్వాడ జగన్నాధం హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటోంది ముంబై భామ పూజా హెగ్డే. ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు చేసినా రాని క్రేజ్.. బన్నీ హీరోయిన్ గా వస్తుండడం విశేషం. ఇప్పటివరకూ పూజాకి క్రేజ్ పరిమితంగానే ఉన్నా.. రీసెంట్ గా 'గుడిలో బడిలో మడిలో' సాంగ్ ప్రోమో విడుదల తర్వాత.. విపరీతంగా జనాల్లో నానుతోంది.

ఇప్పుడీ బ్యూటీకి ఓ సూపర్బ్ గిఫ్ట్ అందింది. ఆర్టిస్ట్ రోహన్ జోగ్లేకర్ నుంచి ఈ బహుమతి అందగా.. ఈ గిఫ్ట్ ఏంటో కాదు.. ఆమె పెయింటింగే. పూజా హెగ్డే ముఖం వరకూ చిత్రపటాన్ని హ్యాండ్ పెయింటింగ్ ద్వారా స్కెచ్ గీసిన రోహన్.. ఆమెకు స్వయంగా ఈ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఈ పెయింటింగ్ పై ముందస్తు సమాచారం లేని ఈ భామ.. ఒక్కసారిగా తన చిత్రపటాన్ని చూసుకుని ఆశ్చర్యపోయిందట. ఈ రోహన్ జోగ్లేకర్ కేవలం ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. పూజా హెగ్డేకు చిన్ననాటి ఫ్రెండ్ కూడా కావడం విశేషం.

తన బాల్య స్నేహితుడి నుంచి అందుకున్న ఈ అపురూపమైన గిఫ్ట్ చూసుకుని తెగ మురిసిపోతోందట పూజా హెగ్డే. అతడి ప్రతిభను వేనోళ్ల పొగడ్డంతో పాటు.. తన పెయింటింగ్ విపరీతంగా నచ్చిందని చెప్పిందట. ఇక ఈ నెల 23న విడుదల కానున్న దువ్వాడ జగన్నాధం మూవీ కోసం పూజా హెగ్డే చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది.

,  ,  ,  ,  ,