Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2016 11:46:59
facebook Twitter Googleplus
Photo


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ?జనతా గ్యారెజ్? సినిమా గత కొద్దికాలంగా పోస్టర్స్, టీజర్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ సినిమాల్లో ?జనతా గ్యారెజ్? మొదటి స్థానంలో ఉంది. ఇక ఆగష్టు 12న ఈ సినిమా విడుదలవుతుందని చాలాకాలం క్రితమే ప్రకటించిన టీమ్, తాజాగా విడుదల తేదీని వాయిదా వేసింది. సెప్టెంబర్ 2వ తేదీని కొత్త విడుదల తేదీగా టీమ్ ఖరారు చేసింది.
కొన్ని అనివార్య కారణాల వల్లే విడుదల తేదీని వాయిదా వేశామని, అభిమానులు సినిమాపై పెట్టుకున్న అంచనాలన్నీ నిజం చేసేలానే సినిమా ఉంటుందని టీమ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ?మిర్చి?, ?శ్రీమంతుడు? సినిమాలతో ఒక బ్రాండ్ సృష్టించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ?జనతా గ్యారెజ్‌?కు అంతటా పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.

,  ,  ,  ,  ,