Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 11:36:08
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ నటిస్తున్న మూవీ రంగస్థలం 1985.. ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఇప్పటికే హీరోయిన్ సమంతకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం ఇతర తారాగణంపై సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నారు. నవంబర్ చివరి నాటికి ఈ చిత్రం పూర్తిగా పిక్చరైజేషన్ పూర్తి చేసుకోనుంది.

ఇప్పుడీ రంగస్థలం కోసం ఓ ప్రత్యేకమైన సాంగ్ ను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. సహజంగా తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ కు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తాడు సుకుమార్. ఆర్యలో అ అంటే అమలాపురం నుంచి సుకుమార్ మూవీస్ లో ఐటెం సాంగ్స్ అన్నీ ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు రంగస్థలంలో కూడా ఇలాంటి ఓ అద్భుతమైన సాంగ్ ఉంటుందట. ఈ పాటలో రామ్ చరణ్ తో సమానంగా డ్యాన్స్ చేసి అలరించగల అందగత్తె కోసం గత కొన్ని వారాలుగా దర్శకుడు సుకుమార్ వెతుకుతుండగా.. ఆ అవకాశాన్ని దువ్వాడ జగన్నాధం బ్యూటీ పూజా హెగ్డేకు అందించినట్లు తెలుస్తోంది. డీజేలో పూజా డ్యాన్సింగ్ స్కిల్స్ ను చూసిన సుకుమార్.. చెర్రీ పక్కన అలరించే డ్యాన్స్ చేసేందుకు ఆమె అయితే కరెక్ట్ జోడీ అని ఫిక్స్ అయ్యాడట.

త్వరలోనే ఈ స్పెషల్ ఐటెం సాంగ్ చిత్రీకరణ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే పూజా హెగ్డేతో అగ్రిమెంట్స్ పూర్తయ్యాయని తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా ఈ పాటపై ఎక్కువగా కేర్ తీసుకుంటున్నాడని అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,